Monday, December 1, 2014

బాలమ్మ మలచిన మహర్షి - సద్గురు సత్యం గారు

బాలమ్మ మలచిన మహర్షి - సద్గురు సత్యం గారు
సద్గురు సత్యం గారి జననం  

శ్రీ  బొమ్మిరెడ్డిపల్లి  వెంకట సూర్య సత్యనారయణ మూర్తి గారు శాలివాహన శకం ౧౮౩౬ (1836)  ఆనందనామ సంవత్సర మార్గశిర కృష్ణ పక్ష చవితి, అనగా  క్రీ ..   1914 సంవత్సరం  డిశంబర్‌  6 తారికున ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమ గోదవరి జిల్లా చేబ్రోలు గ్రామములొ  శ్రీ బొమ్మిరెడ్డిపల్లి సర్వేశ్వరావు, శ్రీమతి  వెంకట సీతమ్మ పుణ్యదంపతులకు ఏకైక సంతానముగా    జన్మించినారు.












అమ్మ సేవలో పుణ్యదంపతుల సంపూర్ణ అభిజిత్ కాలము

చంటిపాపను  సాకేడి తల్లివలె,  తన భక్తి ఙ్ఞానములరెండింటిని  తన భక్తునికి క్రమబద్దముగా తానేనొసంగి, మహోన్నతమైన వ్యక్తిగా, శ్రీవిద్యోపాసకునిగా మలచి ఇరువది ఏడు సంవత్సరముల కాలము  (1963 నుంచి 1989 వరకు ) నిరాటంకముగా శరన్నవరాత్రులదీక్షలను సంపూర్తిగావించి శ్రీవిద్యలో ఒక పరిపూర్ణ అభిజిత్ గా తీర్చిదిద్ది,  1989 సం|| విజయదశమి రోజున  ధ్యానపరిపాకావస్థ యందు కల్గు  అఖండబ్రహ్మాకారవృత్తిని  నొసంగిన  మాతృమూర్తి బాలమ్మ.




 ఆ విజయదశమి  రోజున,  సద్గురుసత్యం దంపతులు నవరాత్ర దీక్షావిరమణ కార్యక్రమములను ఒకదానివెంటకటిగా కార్యక్రమములను పూర్తిచేస్తూ,  అందులో భాగముగా కూష్మాండ బలిహరణ కార్యక్రమమును చేసిన తరుణమున గురువుగారు పరమానందభరితుడై బాలమ్మను తదేకముగా చూచుచూ, తన చెంతనున్న తన కొమరునితో  "నాయినా! ఇది అఖరి సంవత్సరము. అమ్మకు నేను చేయుసేవపూర్తియైనది" అని చెప్పిరి. అదియేవారి చరమవృతి పొందిన దినము. అలా ఒక   మహర్షిగా మలచి మోక్షమునొసంగేను.  



 శ్రీ మహాబాలత్రిపురసుందరి సంపూర్ణ నవరా త్ర దీక్ష విథానగ్రంథమునకు సంకలన కర్తగా చేసి, ఒక మంత్రద్రష్ఠగా  నిలిపెను. మహర్షిసత్యంగారు గాంచిన శ్రీబాలామాలా మంత్ర మూలము  అమోఘము, అద్వితీయము మరియు మహాద్భుతము. 

అష్టదళ నవావరణపీఠపద్మాథిస్తానమూర్తి – శ్రీ చేబ్రోలు బాలమ్మ:
 పశ్చిన గోదవరి జిల్లా లోని  చేబ్రోలు  గ్రామమున  1965  సం|| లో   శ్రీ బాలత్రిపురసుందరి దేవి తన పరమభక్తుడైన  శ్రీ బొమ్మిరెడ్డిపల్లి  వెంకట సూర్య సత్యనారయణ మూర్తి గారి ఇంటి పరిసరాలలో ఇదివరలోనే దొరికిన దివ్యశిలాఫలకంమీద అమ్మలను మించి అమ్మన్నిపించే తన సుందర రూపనిర్మానముగావించమని, ఇది తన నిర్ణయమును తెలిపిఅ భక్తున్ని ఒక పరికరముగాజేసుకుని ఓంకారమున గణపతితోర్ద్వభాగమున సదాశివునితొగూడి అష్ఠభుజిగా సింహవాహనముతొ  స్వయంభువలే నిలిచిన  ఆ తల్లి,   తన భక్తుని చేత అష్టదళ నవావరణపీఠపద్మమును  నిర్మాణమును చేయించుకునిఅందు నవగ్రహదేవతలుఅష్ఠదిక్పాలకులుచతురాయతనదేవతలునవావరణాధిష్ఠానదేవతలతో కూడిన సర్వదేవతాసమిష్ఠికూటమిన  కుడిఎడమల లక్ష్మీసరస్వతులతో, సర్వాలంకారభూషితముగా పద్మోద్భవయై  వెలసిన ఆ మహాబాలత్రిపురసుందరి దేవి వైభవము వర్ణనాతీతము. ఆ అనుగ్రహానందము చెప్పనలవికాదుచూచి తరించవలసినదే.

అస్మద్ద్‌ మాతాపితురులైన, సద్గురుసత్యం దంపతుల ప్రేమానుగ్రహఫలముగా లభించిన స్వగురుపరంపరాధ్ధిష్ఠాన సమస్త గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ, వారి కృపాశ్శీస్సులతో   బాలమ్మభక్తాహృదయానందాశ్శీర్వచనాతత్పరసేవనుకోరుతూ
అమ్మసేవలొ ....
 బొమ్మిరెడ్డిపల్లి  పద్మప్రియా మురళీకృష్ణ దంపతులు
 శ్రీశివఫ్రోలుబాలత్రిపురసుందరిసదనం, చేబ్రోలు

 పశ్చిమ గోదవరి జిల్లా ఆంధ్రప్రదేశ్‌ - 534406